ఎన్టీఆర్ జిల్లా మైలవరం గ్రామానికి చెందిన పజ్జురు గోపాలరావు మంగళవారం మృతి చెందారు. ఆయన కుటుంబాన్ని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్, తెలుగు యువత అధ్యక్షుడు లంక లితీష్ పరామర్శించి, సొంత నిధులతో రూ. 5000 ఆర్థిక సాయం అందించారు. కూటమి ప్రభుత్వం గోపాలరావు కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మల్లెల రాధా, దూరు బాలకృష్ణ, జల్లి కృష్ణ, వాటర్ ప్లాంట్ శీను, పోతురాజు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.