మచిలీపట్నం: రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్
కృష్ణా జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నివారించేందుకు జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు ఆదేశాల మేరకు పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నివసించే చెడు నడత కలిగిన రౌడీలు, డీసీలు, కేడి, సస్పెక్ట్ షీట్ హోల్డర్స్ కు మచిలీపట్నంలో ఆదివారం పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. చెడు నడత కలిగిన వారికి సత్ప్రవర్తన కలిగి ఉండాలని హెచ్చరించారు.