మచిలీపట్నం తాళ్లపాలెం పంచాయితీ మంగినపూడి బీచ్ దగ్గర గల వింగ్స్ అండ్ అవుట్ రిచ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఫౌండేషన్ సభ్యులు దేవదాస్, యానాది పిల్లలకు కలిసి బీచ్ లో ఉన్న వ్యర్థ పదార్థాలను ఏరి మొత్తాన్ని డంపింగ్ యార్డ్ కు తరలించారు. ఈ సందర్భంగా దేవదాసు మాట్లాడుతూ, మా సొసైటీ ఆధ్వర్యంలో పలు స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.