కైకలూరు: బహిరంగంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
కైకలూరు మార్కెట్ యార్డు దగ్గర ఫైర్ స్టేషన్ రోడ్డులో పాలిథిన్ కవర్లో మద్యం సీసాలను పెట్టుకుని ఒక్కొక్క సీసాపై ₹. 20 ఎక్కువ లాభంకు అమ్ముతున్న ముద్రబోయిన లక్ష్మణ అనే వ్యక్తిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతని వద్దనుండి 22 మద్యం సీసాలును స్వాధీన పర్చుకున్నారు. సదరు ముద్దయిని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వచ్చి కేసు నమోదు చేసి రిమాండ్ కి పంపడం జరిగిందని ఎస్సై వెంకట్ కుమార్ తెలిపారు.