ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు కనుమూరి రఘురామ కృష్ణంరాజును డిప్యూటీ స్పీకర్ గా నియమిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం మంగళగిరిలో ఆయనను డిప్యూటీ స్పీకర్ గా నియమించిన సందర్భంగా కైకలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కేక్ కట్ చేసి తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు.