ఏచూరి సీతారాం మృతి పట్ల జిల్లా కమిటీ తీవ్ర సంతాపం

69பார்த்தது
ఏచూరి సీతారాం మృతి పట్ల జిల్లా కమిటీ తీవ్ర సంతాపం
సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ తీవ్ర సంతాపం ప్రకటించింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ. రవి గురువారం ప్రకటన విడుదల చేశారు. సీతారాం ఏచూరి 1952 ఆగష్టు 12న మద్రాసులో స్థిరపడిన తెలుగు కుటుంబంలో జన్మించారని, 1974లో ఎస్‌ఎఫ్‌ఐలో సభ్యుడిగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని తెలిపారు.

தொடர்புடைய செய்தி