తెలుగింటి ఆడబిడ్డల కళ్లలో ఆనందం చూసేందుకు ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలెండర్లను ఉచితంగా ఇవ్వడమే ఈ పథకం ముఖ్యోద్దేశ్యమని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరంలో శుక్రవారం 'దీపం 2. 0' ఉచిత గ్యాస్ సిలిండర్ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఈ పథకంతో దీపావళి పండుగను సీఎం, డీప్యూటీ సీఎం మరింత కాంతివంతం చేస్తున్నారన్నారు. నాయకులు ఆయన వెంట ఉన్నారు.