కొమరాడ: అర్హులైనవారికి ఉపాధి హామీ పనులను కేటాయించండి

83பார்த்தது
కొమరాడ: అర్హులైనవారికి ఉపాధి హామీ పనులను కేటాయించండి
గ్రామాలలో ఎక్కువ మొత్తం ఉపాధి హామీ పనులు చేపట్టి తద్వారా గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మంగళవారం భీమవరం మండలం కొమరాడలో పల్లె పండుగ కార్యక్రమంలో ఉపాధి హామీ నిధులు రూ. 80 లక్షల వ్యయంతో రెండు సిసి రోడ్ల నిర్మాణాలకు భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులతో కలిసి పూజ చేసి శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధికి, అర్హులైన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పనులను పెద్ద ఎత్తున కేటాయించాలన్నారు.

தொடர்புடைய செய்தி