రామచంద్రపురం: ఆసుపత్రికి బెడ్స్ ఏర్పాటు చేయించిన మంత్రి సుభాష్
రామచంద్రపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సి ఎస్ ఆర్ ఫండ్స్ తో 50 మంచాలు పరుపులు దిండ్లు 380 దుప్పట్లు మంగళవారం అందించారు. ఆసుపత్రిలోని మంచాలు కాలం చెల్లి తుప్పుపట్టిన విషయాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ మంత్రి సుభాష్ దృష్టికి తీసుకురావడంతో స్పందించిన మంత్రి సుభాష్ తక్షణమే మంచాలను సమకూర్చినట్లు డాక్టర్ ప్రవీణ్ తెలిపారు.