రామచంద్రపురం మండలం వెల్లసావరం ప్రభుత్వ హౌసింగ్ లే ఔట్ నందు సుమారు 60 లారీల ఇసుకను తరలించుకుపోయినట్లు ఉన్నతాధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు AE టి. వి. భాస్కర్ రావు విలేకరులకు తెలిపారు. ఆయన గురువారం మాట్లాడుతూ. మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగిందని, రాత్రి సమయంలో కొంతమంది వ్యక్తులు లారీలలో ఇసుక తరలించారని అన్నారు. ఉన్నతాధికారులకు, పోలీస్ శాఖకి సమాచారం ఇచ్చామని తెలిపారు.