విజయవాడలో జరుగుతున్న ప్రజాదర్బార్ కార్యక్రమంలో శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి సమస్యలు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం త్వరితగతిన కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని పేర్కొన్నారు.