రామచంద్రాపురం నుంచి చుట్టుపక్కల గ్రామాలకు విద్యార్థుల సౌకర్యార్థం ఉదయం సాయంత్రం వేళలలో బస్సులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. రామచంద్రపురం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో రామచంద్రపురం నుంచి ఇచ్చాపురం వయా విశాఖపట్నం వెళ్లే మూడు 40 సీట్లు గల ఆల్ట్రా డీలక్స్ బస్సులను సోమవారం ఆయన ప్రారంభించారు.