రామచంద్రాపురం: కూటమి అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలి: మంత్రి
పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజ శేఖర్ ను అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. శుక్రవారం రామచంద్రాపురంలో జరిగిన ఎన్డీఏ కూటమి నాయకుల విస్తృత స్థాయి సమావేశం పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.