తుని ఎమ్మెల్యేకు గీత కార్మికులు వినతిపత్రం
ఎక్సయిజ్ పాలసీలో శెట్టిబలిజ, గీత కార్మికులకు షాపుల కేటాయింపులో రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ తుని ఎమ్మెల్యే యనమల దివ్యకు శెట్టిబలిజ సంఘ నాయకులు మంగళవారం వినతిపత్రం అందజేశారు. తుని మండలం తేటగుంట టీడీపీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. తుని నియోజకవర్గంలో గీత కార్మికులకు 10% రిజర్వేషన్ అమలయ్యే విధంగా చూడాలని ఎమ్మెల్యే దివ్యను వారు కోరారు.