కాకినాడ జిల్లా తుని పట్టణం సీతారాంపురం ప్రాంతానికి చెందిన నాని క్యాన్సర్ తో మంచానికి పరిమితమయ్యాడు. దీంతో దాతల సహాయ సహకారం కోసం ఆ కుటుంబం ఎదురుచూస్తుంది. నిన్న మొన్నటి వరకు స్వర్ణకారుడిగా జీవనం కొనసాగించేవాడు. అయితే అనుకోని విధంగా క్యాన్సర్ సోకడంతో మంచాన పడ్డాడు. దీంతో పెద్ద ఎత్తున ఖర్చవుతున్న తరుణంలో దాతలు సహాయం చేయాలని బాధిత కుటుంబం బుధవారం వేడుకుంటున్నారు.