భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ. ఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శనీయమని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకొని మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం క్యాంపు కార్యాలయంలో మంగళవారం అంబేడ్కర్ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేడ్కర్ ఆదర్శనీయుడని, ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా నిలిచారన్నారు.