కూనవరం మండలం కూటూరు, ముళ్లూరు, కూటూరు గట్టు గ్రామాలకు రోడ్లు నిర్మించాలని సీపీఎం సభ్యుడు పాయం సీతారామయ్య అన్నారు. చింతూరు ఐటీడీఏ పీఓ అపూర్వ భారతకు బుధవారం వినతిపత్రాన్ని అందజేశారు. నిధులు మంజూరు చేయాలని, బడి పిల్లలకు మధ్యాహ్నం భోజనం, బియ్యం ప్రతి నెల ఇవ్వాలని కోరారు.