ఈనెల 3వ తేదీన రాజమండ్రి చెరుకూరి తోటలో జరిగే రాష్ట్ర శెట్టిబలిజ వనభోజన మహోత్సవాన్ని, శెట్టి బలిజ వధూవరుల ఉచిత వివాహ పరిచయ వేదిక విజయవంతం చేయాలని సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాన బోయిన రామారావు పిలుపునిచ్చారు. శుక్రవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐక్యత చాటేందుకు ఏర్పాటు చేసిన మన సమారాధనకు సంఘీయులంతా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి 5 వేల మంది హాజరుకానున్నారని చెప్పారు.