మండపేట: రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే వేగుళ్ళ
రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ గా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు నియమితులయ్యారు. వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన జోగేశ్వరరావు కు కూటమి ప్రభుత్వం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించింది. గురువారం అమరావతిలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ ఎంపిక జరిగింది. వేగుళ్ళకు రాష్ట్రస్థాయి పదవి రావడం పట్ల నియోజకవర్గ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.