మండపేట పురపాలక సంఘ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి, మున్సిపల్ కమిషనర్ టివి. రంగారావు కొబ్బరినూనె, సబ్బులు, చెప్పులు గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఛైర్ పర్సన్ మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రతలో కార్మికుల చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ ముత్యాల సత్తిరాజు, యరమాటి వెంకన్నబాబు, జొన్నపల్లి సత్తిబాబు, పాల్గొన్నారు.