దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలం నిజలపూర్ గ్రామానికి చెందిన పి. నాగన్నకు వెన్ను సంబంధిత అపరేషన్ కోసం హైద్రాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 2 లక్షల 50 వేల రూపాయల ఎల్ఓసిని శుక్రవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూధన్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.