మండపేట మండలం ద్వారపూడిలో విగ్రహం ఏర్పాటు విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ను గురువారం రాజమండ్రిలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడారు. ద్వారపూడిలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే స్పెషల్ బెటాలియన్ ను రంగంలోకి దింపి విగ్రహాన్ని పోలీసులు పెకలించుకుపోయారన్నారు. ఈ విషయంలో టీడీపీ, జనసేన, వైసీపీ అన్ని పార్టీలు కలిసిపోయాయన్నారు.