ఆలమూరు: మహిళలపై అనుచితంగా ప్రవర్తిస్తే 112 కు కాల్ చేయండి

79பார்த்தது
ఆలమూరు: మహిళలపై అనుచితంగా ప్రవర్తిస్తే 112 కు కాల్ చేయండి
మహిళలపై ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే వెంటనే 112కు కాల్‌ చేయాలని ఆలమూరు ఎస్‌ఐ ఎం. అశోక్ విద్యార్థినులకు సూచించారు. ఆలమూరు మండల పరిధిలోని కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం మహిళా సంరక్షణపై విద్యార్థినులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యార్థినులకు సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడుల గురించి వివరించారు. ఇంట్లో తల్లిదండ్రులు, పాఠశాలలో ఉపాధ్యాయుల మాట వింటే భవిష్యత్తు బాగుంటుందన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி