కాకినాడలోని జయలక్ష్మి కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ ఖాతాదారులకు న్యాయం చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కోరారు. మంగళవారం కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ ను జయలక్ష్మి బ్యాంకు అసోసియేషన్ సభ్యులతో కలిసి వినతి పత్రం అందజేశారు. జయలక్ష్మి కో-ఆపరేటివ్ బ్యాంక్ వల్ల నష్టపోయిన ప్రతి ఖాతాదారుడుని ఆదుకోవాలని ఆయన కోరారు.