ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించి, బాధ్యతతో రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని కాకినాడ డిఎస్పి రఘువీర్ విష్ణు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ పీఆర్ కాలేజీలో ట్రాఫిక్ నిబంధనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, రహదారిపై వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.