గండేపల్లి: తాగిన మత్తులో వాహనాలు నడిపిన చోదకులకు జరిమానా
మద్యం మత్తులో వాహనాలు నడిపిన 8 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివనాగబాబు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు నమోదు చేసిన 8 మందిని పెద్దాపురం కోర్టులో హాజరుపరచగా ఆరుగురికి ఒక్కొక్కరికి రూ. పది వేలు చొప్పున జరిమానా, ఇద్దరికి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన మరో 9 మందికి రూ. 500 చొప్పున జరిమానాను మేజిస్ట్రేట్ కృష్ణ శేషాచార్య విధించినట్లు తెలిపారు.