గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో శ్రీ వేగులమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరంలో సుమారు 400 మంది రోగులను పరీక్షించారు. దుర్గాడ గ్రామంలోని వేగులమ్మ గుడి సెంటర్ వద్ద సాయినాథ్ క్లినిక్ నిర్వహించిన వైద్య శిబిరంలో 400 మందిని పరీక్షించిఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరంలో డాక్టర్ కె వంశీకృష్ణ వైద్య సేవలు అందించగా కేదారిశెట్టి చలపతి, వేగులమ్మ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.