ఏర్పేడు ఎంపీడీవో కార్యాలయంలో రేణిగుంట డిఎస్పి శ్రీనివాసరావు, ఏర్పేడు సీఐ జయచంద్ర, ఎంపీడీవో సౌభాగ్యం, ఎంఈఓ లు మహిళల పై జరుగుతున్న అఘాయిత్యాలు, బాల్య వివాహాలు, గ్రామాలలో గంజాయి, బెల్ట్ షాప్స్ లపై జిఎంఎస్కే, వెలుగు ఏబీఎంలతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. వారు మాట్లాడుతూ మండలంలో జిఏంఎస్కేల పాత్ర చాలా ముఖ్య మైనదని గ్రామాలలో ఎలాంటి సంఘటనలు జరిగిన వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొని రావాలన్నారు.