తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరులోని లాయల్ టెక్స్ టైల్స్ పరిశ్రమ వద్ద బుధవారం కార్మికులు ఆందోళన చేపట్టారు. లాకౌట్ ప్రకటించి కార్మికులకు అన్యాయం చేస్తున్న పరిశ్రమ యాజమాన్యం దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. కార్మికులకు చట్టపరమైన రాయితీలు ఇవ్వకుండా పరిశ్రమను మూసివేసి కార్మికుల కడుపు కొట్టారని వాపోయారు.