ఓ మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై గురువారం పోక్సో కేసు నమోదు చేసి రిమాండు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. గూడూరుకు చెందిన బాలిక(17)ని శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట వేణుగోపాలపురానికి చెందిన వంశీ అనే యువకుడు ప్రేమ, పెళ్లి పేరు చెప్పి నమ్మించి మోసం చేశాడన్నారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వంశీపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు.