జిల్లా పోలీసు, సైబర్ నేర విభాగం, శ్రీసిటీ సంయుక్త ఆధ్వర్యంలో 'సైబర్ క్రైమ్ & సైబర్ సెక్యూరిటీ'పై అవగాహన సదస్సు శుక్రవారం సత్యవేడు నియోజకవర్గం శ్రీసిటీలో జరిగింది. వివిధ రకాల సైబర్ నేరాలు, బెదిరింపులు, నివారణ చర్యలు అంశాలపై హైదరాబాద్లోని సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఐఎల్ నరసింహరావు వివరణ ఇచ్చారు. కార్యక్రమంలో శ్రీసిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.