చిత్తూరు జిల్లా, పుంగనూరు మండల పరిధిలోని కపాడం మిట్టపల్లి గ్రామానికి చెందిన కృష్ణప్ప కుమారుడు మునీశ్వరపై అదే గ్రామానికి చెందిన రాజు పాత కక్షలు నేపథ్యంలో శుక్రవారం దాడి చేశారు. ఈ దాడిలో మునీశ్వర తలకు తీవ్ర గాయం కావడంతో స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వైద్యులు చికిత్సలు నిర్వహించి మునీశ్వర తలకు ఐదు కుట్లు వేశారు. ఈ ఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.