పిటీఎంలో బుధవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశాన్ని కూటమి నాయకులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాలమధ్య వివాదం తలెత్తి ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న మదనపల్లె డీఎస్పీ కొండయ్య నాయుడు ఇరువర్గాల మధ్య గొడవలు జరగకుండా పోలీసులను ఎంపీడీఓ ఆఫీసు వద్దకు పంపించి పోలీస్ పీకెట్ ఏర్పాటు చేశారు. పోలీస్ పికెట్ ఉండడంతో గొడవలు సద్దుమనిగాయి. చివరకు మండల సమావేశం వాయిదా పడటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.