బైరెడ్డిపల్లి మండలంలోని కుమ్మరిగుంట గ్రామంలో గ్రామ పెద్దల మాట వినలేదనే కక్షతో ఓ కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేసిన సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితులు గంగరాజు, మణి, శంకరప్పలు తెలిపిన వివరాల మేరకు. తమ భూమిని గుడి పెద్దలు ఆక్రమించుకున్నారని కోర్టులో కేసు వేసినట్లు చెప్పారు. దీంతో తమను గ్రామ బహిష్కరణ చేసినట్లు చెప్పారు. తమతో మాట్లాడిన వారిపై రూ. 50వేలు జరిమానా విధిస్తామని చాటింపు వేశారన్నారు.