చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్ల పంచాయతీలో మరమ్మతులకు గురైన బోరును ఆదివారం సర్పంచ్ చంద్రశేఖర్ మరమ్మతులు చేయించారు. తాగునీటికి ఇబ్బందులు ఎదురు కావడంతో సర్పంచ్ కు పంచాయతీ ప్రజలు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న సర్పంచ్ వెంటనే మరమ్మతులు చేయించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు, సర్పంచ్, స్థానికులు పాల్గొన్నారు.