గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరులో సోమవారం కరెంట్ షాక్ కొట్టడంతో 18 సంవత్సరాల అజ్మల్ మృతిచెందిన ఘటన జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం, అజ్మల్, చిత్తూరు తేనెబండకు చెందిన సాయి, భాను ప్రసాద్ పెనుమూరు వద్ద ఓ ప్రైవేట్ గ్రానైట్ ఫ్యాక్టరీలో పని చేస్తూ కరెంట్ షాక్కు గురయ్యారు. అజ్మల్ అక్కడికక్కడే చనిపోగా, మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.