ఎన్నో ఏళ్లుగా రహదారి సక్రమంగా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ రాకపోకలు సాగిస్తున్న జీడీ నెల్లూరు మండలం, నెల్లెపల్లి పంచాయతీ, పెద్ద మిట్టపల్లి ఎస్టీ కాలనీకి ఎన్డీఏ ప్రభుత్వంలో రహదారికి మోక్షం లభించింది. పెద్ద మిట్టపల్లి ఎస్టీ కాలనీ గ్రామ ప్రజల సమస్యకు ఎట్టకేలకు మంగళవారం పరిష్కార మార్గం లభించింది. రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి.