వెదురు కుప్పం మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కళాశాల నిర్మాణానికి సీఎం చంద్రబాబు రూ. 17 కోట్ల 82 లక్షల 50 వేలు కేటాయించారు. దీనికి సంబంధించి ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తెలిపారు.