యువత ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఎంపీ
సూక్ష్మ, మధ్య తరగతి పరిశ్రమల స్థాపనతోనే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు అన్నారు. గురువారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ సచివాలయంలోని డి అర్ డి ఏ సమావేశ మందిరంలో పి ఎం ఈ జి పి పథకానికి సంబంధించి జిల్లా స్థాయి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ చదువుకున్న యువత ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని మరికొందరికి ఉపాధి కల్పించవచ్చన్నారు.