శాంతిపురం మండలం రాళ్ళబుదుగురు పంచాయతీ పరిధి గొల్లపల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఘనంగా సరస్వతి పూజను నిర్వహించారు. అదేవిధంగా ఐదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. పూజ అయిన అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచారు. పాఠశాల హెచ్.ఎం వాణి ఈ కార్యక్రమం గురించి అదేవిధంగా ఐదో తరగతి విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని వారు ఇంకా మంచి స్థాయిలో ఉన్నత చదువులు చదవాలని చెప్పారు.