జిల్లా కేంద్రం చిత్తూరులోని వన్ ఇయర్ బ్లాక్లో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మున్సిపల్ కమిషనర్ అరుణతో కలిసి శనివారం ఉదయం 6 గంటల నుండి పర్యటించారు. డ్రైనేజ్ వ్యవస్థపై ఆరా తీశారు. సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వర్షాలు పడకపోయినా అప్పుడప్పుడు రోడ్లపైనే మురుగునీరు వస్తుందని స్థానిక ప్రజలు తెలియజేశారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటానని, పరిష్కరిస్తానని ప్రజలకు తెలియజేశారు.