వినుకొండ: విద్యుత్ శాఖ సిబ్బందిపై ఫిర్యాదు

82பார்த்தது
వినుకొండ: విద్యుత్ శాఖ సిబ్బందిపై ఫిర్యాదు
వినుకొండ మండలంలోని పలువురు విద్యుత్ శాఖ సిబ్బందిపై ప్రజలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని నాగులవరం గ్రామంలో విధులు నిర్వహిస్తున్న పలువురు విద్యుత్ శాఖ సిబ్బంది వినియోగదారులను ఇక్కట్లకు గురిచేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని నరసరావుపేట డీఈ రాంబోట్లకు లిఖితపూర్వకంగా ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై డీఈ స్పందిస్తూ ఆరోపణలు వచ్చిన వారిపై విచారణ చేపట్టాలని వినుకొండ ఏడీఈకి ఆదేశాలు జారీ చేశారు.

தொடர்புடைய செய்தி