తుళ్లూరు: బిసీలకు 33% రిజర్వేషన్ పై మంత్రి సవితకు కృతజ్ఞతలు
బీసీలకు 33% రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని వెనుకబడిన తరగతుల సంఘాలు హర్షించాయి. గురువారం తుళ్లూరు మండలం వెలగపూడి సచివాలయంలోని మంత్రి సవితను ఆమె కార్యాలయంలో ఆయా సంఘాల నేతలు కలిసి సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ బీసీల అభ్యున్నతే ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ లక్ష్యమని, సీఎం చంద్రబాబు బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు.