తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గురువారం గుంటూరులోని తాడికొండ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన 24 లక్షల 74 వేల 891 రూపాయల చెక్కులను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా, ముఖ్యమంత్రి సహాయనిధి పేదల కోసమే వరంగా పనిచేస్తున్నదని ఆయన పేర్కొన్నారు.