విద్యుత్ లైన్ల మరమ్మత్తుల కారణంగా ఈ నెల తొమ్మిదో తేదీ శనివారం ఉదయం నుండి మధ్యాహ్నం 1: 00 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిరంజీవి తెలిపారు. రేపల్లె మరియు గంగిరెడ్డిపాలెం ఫీడర్స్ మరమ్మతులు కారణంగా రేపల్లె పట్టణం మరియు మండల పరిధిలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.