గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం నిడుబ్రోలు ఓవర్ బ్రిడ్జి దగ్గర నుండి మార్కెట్ యార్డ్ వరకు శనివారం రోడ్డు మరమ్మత్తుల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ప్రారంభించారు. గత వైసిపి పాలనలో రాష్ట్రo లో రోడ్లన్నీ గుంతల మయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని కూటమి ప్రభుత్వంలో రోడ్లకు మహర్దశ పట్టిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు.