ప్రకాశం: వాన మళ్లీ మొదలు.. ఏకంగా మూడు రోజులు
బంగాళఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. ఈ ప్రభావంతో ప్రకాశం జిల్లాలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ మంగళవారం ప్రకటించింది. దీంతో మత్స్యకారులు సముద్ర తీరానికి వెళ్ళకూడదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.