కొండేపి: బ్రిడ్జి పనులను పరిశీలించిన మంత్రి
ప్రకాశం జిల్లా కొండేపి మండలం వెన్నూరు వద్ద నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జి పనులను ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ఆదివారం పరిశీలించారు. పనుల పురోగతిని మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. పనుల నాణ్యతలో ఎక్కడ రాజీ పడవద్దని అధికారులకు మంత్రి స్వామి సూచించారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు.