నిరుపేద ప్రజలకు సేవ చేయడంలో కాక కుటుంబం ఎల్లప్పుడూ ముందుంటుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. ఆదివారం సాయంత్రం బెల్లంపల్లి వంద పడకల ఆసుపత్రిలో ఎమ్మెల్యే కూతురు గడ్డం వర్ష ఆధ్వర్యంలో నెన్నల్ మండల ప్రజలకు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కంటి వైద్య శిబిరాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరు సహకరించడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు.