ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఆదివారం మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి బంగారు బాల్యం కార్యక్రమం సందర్భంగా బాలల హక్కులు అనే గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి మన దేశ భవిష్యత్తుని బంగారు బాల్యం చాలా విలువైనదని అది బాలల ఉజ్వల భవిష్యత్తుకు నాంది కావాలని అన్నారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.